![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvxgj3Tt1zDPwCJu4HmYF7DEYQ4JnNVwoflb4TcBqL08BwLcxzP-mPCAJl6tH8UlxPiYDhv0s9o_6YSYy54ergrjpDHSi78URaIDvZh-T6nuVMPrVkjHHD2Yy0TK25ma2Xh21bMF9mYsKQ/s200/raja_ravi_varma_oleograph_5_keechaka_sairandhri.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgggP8Vv-4cSLM3kXpAfrUGkZeCU4xDtsewUFdqfWCjARatTW-3_tDusCaDtjNnaLdnxYdrzPUoBlL1m4iyxq3Ce6_HgYRxwa5yL4coNIocMAM65U0F1Zecn5WSckrLklvUvFJt6MLXDAhX/s200/raja_ravi_varma_oleograph_2_hamsa_damayanthi.jpg)
ప. కొక్కోరొకోయని కోడి కూత కూసె
మక్కువ యెంతయొ మనసున నిండె
1. చక్కదనాల చుక్కవలె నుంటిని
చుక్కల చీరలో చక్కగ నేనుంటి
చక్కగ నా మనసు సరిగమ పాడ
చిక్కుకొంటిని నీ చక్కని మోమున
2. చిక్కుకొంటిని నే చిత్రమగు తాపాన
చెక్కుచెదరని నా చేతిలొ చెయ్యేసి
చక్కిలిగింతలతొ పక్కలోనికి లాగి
చిక్కుముడి విప్పి నా చింత దీర్చితివి
3. అక్కుననున్న నా ఆణిముత్తెములు
చిక్కుకున్నవి నా చిరు ముంగురులలో
ఫక్కుఫక్కున నవ్వు నవ్వలేకున్నాను
చక్కగ నీవేమొ సరసమాడుచుండ
రచన: కొడవంటి 20092010 smkodav@gmail.com
======================================
======================================
(2)
ప. తాళలేకున్నాను ఓ తాపసీ నేను
వేళ మించకుండ వెవేగ రారాద
1. మేను పులకరించె మోము చెమరించె
మేనకను నేను మనసున్న దానను
మనసున మరులాయె మదన తాపమాయె
తనివి తీరగ నన్నుచేరంగ రారాదా
2. జపమాల యెందుకు నీ చెంతనేనుండ
తపము చాలించి నా తాపము తీర్చుమ
కోపగించక వేగ మరులనోదార్చుమ
మాపటి వేళకు మర్మమ్ము తెలియు
రచన: కొడవంటి 22092010 smkodav@gmail.com
(3)
ప. నాసామి రాడాయె నాకెమో దిగులాయె
నిసి రేయిలో నిముసము యుగమాయె
1. వద్దన్న వదలక వడలు పులకరించె
ముద్దుల నా సామి మదిలోన మెదలె
మద్దెల మోతలు మది నిండ నిండె
సద్దు సేయక సామి చెంతకు రాడాయె
2. కంటిమీద కునుకు కానగ రాదాయె
వంటిమీద వలువ నిలువ లేదాయె
మంటలు నా మేన మెలికలు తిరిగె
జంట కోరి వడలు జలదరించుచుండె
రచన: కొడవంటి 25092010 smkodav@gmail.com
======================================
(4)
ప. తొలి కోడి కూసె మలి కోడి కూసె
తెల్లారిపోతోందె నేనేమి సేతునె
1. పల్లె పడచులంత పళ్లమ్మ బోయేరె
కల్లాపు జల్లుచు కామాక్షి కనుపించె
మల్లె పూలలోన మీనాక్షి కనుపించె
వలపుచిందించ వల్లభుడు రాడాయె
2. కల్ల లేని మల్లె మనసు నాదాయె
యెల్లలేలేనట్టి యేకాంత నెలవాయె
బుల్లిబాబు వచ్చి బుజ్జగించడాయె
జల్లులు నామేన చిలకరించడాయె
రచన: కొడవంటి 16092010 smkodav@gmail.com
======================================
(5)
ప. వదినమ్మ పిలిచె వదలడాయె విభుడు
గదిలోకి రమ్మని గడియ వేసినాడు
1. గారాల నామగడు గంపెడాశతోడ
భారమే తెలియక బంధించె తనమేన
చిక్కని చీకటిలొ చిరుమేన చిందుల
చక్కబెట్టినాడు సరసమాడుచు నన్ను
2. అక్క పిలిచినాది అయ్యయ్యో నాసామి
చక్కన్ని వలువలు సరదాకి తీయించి
చెక్కిలి నొక్కుచు చిలిపి చేష్టలు చేయ
వుక్కిరి వూపులతొ మైమరచి నేనుంటి
రచన: కొడవంటి 17092010 smkodav@gmail.com
======================================
(6)
ప. రాడాయెనే నేడు గారాల నా విభుడు
కోడి కూసెడి వరకు కులికెడి వాడు
1. వాలుజడ వేసికొంటి వన్నెల చీరను గట్టితీ
జాలువారే పైటలోన జలదరింపులనోపనైతి
కాలాతీతమ్మాయె కామాతిశయమ్మాయె
ఏలనో నావిభుడు నన్నేలగ రాడాయె
2. వేడి నిట్టూర్పులతొ వేడుక చేసెడి వాడు
కండ బలము యెంతో కలిగిన వాడు
వాడలోని కెల్ల వన్నె తరుగని మొనగాడు
వీడలేని బంధము విసుగు తెలియని మర్మము
రచన: కొడవంటి 02102010 smkodav@gmail.com
*******************************************
(7)
ప. మన్మధ తాపముతో మధనపడుచు నుండగ
మన్మనో నాధుడునన్ను మంచమున చేరబిలిచె
1. గూటిలోన గుప్తపరచిన గుప్తపటములు చూడగ
మాటిమాటికి మనసులో మరులు పొంగి పొరలగ
2. వారకాంతల వంటికులుకులు దూరదర్శినిలోనజూడగ
చీర చాటున చిన్నెవన్నెలు వలపు వీణను మీటగ
3. ముందుగదిలో బావగారు ముద్దులభార్యను పిలవగ
చిందులేయుచు తోడికోడలు
పసందుగగది
తలుపుమూయగ
రచన: కొడవంటి 03102010 smkodav@gmail.com
====================================== (8)
ప. ఎంతగానో నామది యేకాంతసేవకు వేచియుండ
ఇంతలో నాకాంతుని అల్లంత దూరమునందు గాంచితి
1. గున్నమామిడి గుబురులోన గుబులుతో నేనుండ
పున్నమి వెన్నెలలోన పూలు గలగల రాలుచుండ
సన్నాయి గొంతుగలతో కోయిలమ్మలు కూయుచుండ
సన్నిబాబు రాకకై కానులు కాయలు కాచుచుండ
2. పులపాన్పునందున ఘుమఘుమలు గుబాళించె
పాలుగారే యవ్వనముతో పాన్పు పైన పవ్వళించితి
అలుపెరుగని నాసామి అతివరోయని నన్నుజేరి
కాలమే తెలియనీక కామ క్రీడలొ కులికించె
========================================
(9)
ప. మీటునదెవరె నా మానస వీణను
మాటి మాటికి నే మరుల జిక్కుకొంటి
1. ముసిముసి నవ్వులు మోమున నిండె
పసిడి పరువము పరుగులు తీసె
నిసిఱేయి యైనను నిద్దుర రాదాయె
వసి వాడని వయసు పరవశమ్మాయె
2. పైట వంటిపైన నిలువంగ లేదాయె
కటకటా యేదారి కానంగరాదాయె
చిటపట చినుకుల చిందులు యెపుడొ
No comments:
Post a Comment